ముఖ్యమంత్రిని అభినందనలు, కృతజ్జ్ఞతలతో ముంతెచ్చిన చేనేత కార్మికులు.
చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన పెన్షన్ల పెంపు,ఉచితవిద్యుత్ 100 యూనిట్లు నుండి 150
పెంపు,నూలు పై రాయిటింపెంపు,చేనేత సొసైటీల త్రిఫ్ట్ ఫండ్ పెంపు,చేనేత కార్మికుల వ్యక్తి గత రుణాలు,గ్రూపు రుణాలు మాఫీ చేయడం పట్ల వీవర్స్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీరాల నుండి శాసనమండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత,కర్నూలు జిల్లా నుండి ఎంపీ శ్రీ నిమ్మల కిష్టప్ప, గుంటూరు జిల్లా మంగళగిరి నుండి శ్రీ గంజి చిరంజీవులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు బుధవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిశారు.ముఖ్యమంత్రి ప్రకటించిన
రాయితీలు ,పెన్షన్స్ పెంపు పై హర్షం వ్యక్తం చేస్తూ గజమాలతో సత్కరించారు. చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారుచేసిన వస్త్రాలను ముఖ్యమంత్రి కి బహూకరించారు.













