ఏపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే : జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు వైసీపీ ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీలను మోసం చేసిన వైసీపీ సర్కార్ బీసీ సభ పెట్టిందని ఆరోపించారు. జయహో బీసీ కాదు భయవో బీసీ సభ పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. నిధులు, వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి మోసం చేశారన్నారు. చేనేత, పద్మశాలి, యాదవులకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు అలంకార ప్రాయమైన పదవులతో బీసీలకు ఒరిగేదేమీ లేదని వెల్లడిరచారు. ఆంద్రప్రదేశ్ రాస్ట్రంలో ఒక సామాజికి వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు. వైసీపీ భయభ్రాంతులకు గురి చేసిన బీసీలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే భవిష్యత్లో బీసీలు వైసీపీని నమ్మరని తెలిపారు.













