మూడు భవనాలు కట్టలేని ఈ ప్రభుత్వం.. మూడు రాజధానులు కడుతుందా?
మూడు భవనాలు కట్టలేని ఈ ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టేందుకే మూడు రాజధానుల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. పతనావ్యస్థకు చేరిన ఆర్థిక పరిస్థితిని కప్పించ్చుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా ఎందుకివ్వరని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని డిమాండ్ చేశారు. రాజధాని కడతామని అమరావతి రైతులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ ఆదాయం పరిస్థితి బాగుంటే రోడ్ల పరిస్థితి ఇలా ఎందుకుంటుందని ప్రశ్నించారు. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉందనడానికి ఏం ఆధారాలున్నాయని నిలదీశారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఒక రాజకీయ ఎత్తుగడ అని వ్యాఖ్యలు చేశారు.













