మనం ఏపీలో ఉన్నామా?.. పాకిస్థాన్లో ఉన్నామా?
మనం ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్లో ఉన్నామా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ మీద చిత్తశుద్ది ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచుగా అని నిలదీశారు. కోనసీమ అల్లర్లకు బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర చర్యలు సమర్థనీయం కాదన్నారు. దేశ ప్రజలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేద్కర్ పేరుపై వైసీపీ ప్రభుత్వం వివాదం స్పష్టించిందని మండిపడ్డారు.













