రాష్ట్రానికి ఒకే రాజధాని బీజేపీ విధానం : జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది బీజేపీ విధానమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖ వచ్చిన రాజధాని రైతులతో బీజేపీ కార్యాయంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31న సుప్రీంకోర్టులో వాయిదా ఉన్నందున కేంద్రం తరపున ప్రమాణ పత్రం దాఖలు చేసేలా చూడాలని అమరావతి రైతులు ఆయన్ని కోరారు. ఈ సందర్బంగా జీవీఎల్ మాట్లాడుతూ రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలన్నీ చట్ట పరిధిలో జరిగినందున ఒకే రాజధాని ఉండాలని తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌కు కూడా రాజధాని రైతులు విన్నపం అందజేశారు. ఒకే రాజధాని బీజేపీ విధానమని ఆయన స్పష్టం చేశారు.













