ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేయడం తప్ప కొత్త కంపెనీలను తీసుకొచ్చే ఆలోచన ఉందా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. 2014లో జగన్ ఓడిపోతే అమరావతిలోనే ఉంటారని గ్యారెంటీ ఏముందని నిలదీశారు. రాష్ట్రంలో ఐటీ రంగం కుదేలైంది. ఐటీ రంగ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 0.1 శాతం ఉంది. ఐటీ ఉత్పత్తుల్లో రాష్ట్రం ఎక్కడా కనిపించట్లేదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైన బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొత్త కంపెనీలను తెచ్చి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఎందుకు చేయట్లేదు? రాష్ట్రానికి చెందిన యువత తమ ప్రతిభతో 10 నుంచి 15 శాతం ఐటీ రంగాన్ని నిర్దేశిస్తుంటే ఐటీ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రం అత్యంత ఘోరమైన స్థితిలో ఉందని, ఇదే విషయాన్ని నేను పార్లమెంట్లో జీరో అవర్లో ప్రస్తావించా, టీడీపీ, వైసీపీ నేతలకు అధికారంలో ఉంటనే ఆంధ్రప్రదేశ్ గుర్తొసుంది. లేదంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. నిన్న జగన్ మాట్లాడుతూ నాపేరు జగన్ నేనిక్కడే ఉంటానని డైలాగులు కొట్టారు. గతంలో అమరావతి విషయంలోనూ అదే చెప్పారు. రాజధాని ఇక్కడే ఉంటుందన్న మాటకు కట్టుబడి లేదు. మరి ఈ మాటకు కట్టుబడి ఉంటారనే గ్యారెంటీ ఏంటీ? ఎలాగు 2024లో అధికారం చేజారిపోతుంది. అప్పుడు కూడా అమరావతిలోనే ఉంటారా. దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని అని డిమాండ్ చేశారు.













