శాఖలపై కనీస అవగాహన లేని వాళ్లు… మంత్రులుగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో వ్యవస్థలన్నీ సర్వ నాశనం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ వినుకొండలో చేపట్టిన రీలే నిరహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కనీసం సాంప్రదాయాలను కూడా జగన్ పాటించడం లేదని మండిపడ్డారు. శాఖలపై కనీస అవగాహన లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారన్నారు. వైద్య శాఖ పై విడుదల రజనీ కి ఓనమాలు తెలియదని విమర్శించారు. కాలువకు `నదికి తేడా తెలియని వ్యక్తి అంబటి రాంబాబు అని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్, జగన్, షర్మిల కూడా ఒళ్లు బలిసి పాదయాత్రలు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.













