Manohar Naidu : గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు (Manohar Naidu) తన పదవికీ రాజీనామా చేశారు. 2021లో వైసీపీ నుంచి మనోహర్ నాయుడు మేయర్ (Mayor) గా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) , మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరో వైపు ఫిబ్రవరి లో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండిరగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టీడీపీ(TDP), జనసేన (Janasena) కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. ఈ నెల 17న స్టాండిరగ్ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్ కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మనోహర్ తన పదవికి రాజీనామా (Resignation) చేశారు.













