మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేయండి.. గుంటూరు కోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. అంబటి నేతృత్వంలో వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.













