చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే … అక్కడి నుంచి చేస్తా
మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను టీడీపీలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని తెలిపారు. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. ఆలూరుకు సేవలందించా. ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. ఆ స్థానంపై కొందరు ఆశలు పెట్టుకోవచ్చు. తాను అందర్నీ కలుపుకొని ముందుకెళ్తా. రాష్ట్రానికి మంచి జరగాలని, చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు.













