కేసీఆర్, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన… పరిస్థితి తమకు లేదు
మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌కు మధ్య గొడవలు ఉంటే వాళ్లు చూసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్‌పై విమర్శలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. హరీశ్‌రావు జగన్‌ను తిడితే మేం ఇక్కడ కేసీఆర్‌ను తిడతాం అది చూసి హరీశ్ హ్యాపీ ఫీలవుదామన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఎలాంటి సంక్షేమం అందుతుందో, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో జరిగిన సంక్షేమం, వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏపీలో జరిగిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ భవన్లో అధికారిని హరీశ్‌రావు ఎలా తన్నారో అందరూ చూశారని అన్నారు. ఇటీవల కేటీఆర్ ఉదయం విమర్శ చేసి రాత్రికి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు.













