ముఖ్యమంత్రి అవుతానంటే తాను కూడా… మూడు పెళ్లిళ్లు
మూడో, నాలుగో పెళ్లిళ్లు చేసుకుంటే ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందంటే తాను కూడా అన్ని పెళ్లిళ్లు చేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి కూడా గెలవలేనని ముమ్మిడివరంలో పవన్‌కు జ్ఞానోదయం అయిందని అన్నారు. ఉపవాసాలు చేస్తేనో, నలుగురిని పెళ్లి చేసుకుంటేనో, నలుగురిని తిడితేనో ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. నాకు ఉప ముఖ్యమంత్రి కావాలని ఉంది. నేనూ 15 రోజులు ఉపవాసాలు చేస్తాను. అయిపోతానా? అని ప్రశ్నించారు. ఒక లీడర్‌కు కావాల్సిందేంటి? నిబద్ధత, డెడికేషన్, స్థిరత్వం, సహనం ఉండాలి అని అన్నారు. అభిమానులు ఉన్నారు. సినీ నటుడిగా చర్మిషా ఉంది. కాపు కులంలో పుట్టారు కాబట్టి అది కూడా కలిసి వస్తుంది. నిజంగా వీటన్నింటినీ వాడుకోవాలని అనుకుంటే దానికి అనేక రకాల దారులు ఉన్నాయి. డెడికేషన్ ఉండుంటే కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యే వారేమో అంటూ పవన్‌ను ఎత్తిపొడిచారు. ప్రతిపాడు వచ్చి ఎమ్మెల్యే కావాలని అంటారు. పిఠాపురం వచ్చి ముఖ్యమంత్రిని చేయమని అంటారు. ముమ్మిడివరం వచ్చి ఈసారి గెలవకపోయినా కలిసి పోరాటం చేయాలని అంటూరు పవన్ కల్యాన్ అని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీయదని, ఈసారి కూడా జనసేనానికి ఎమ్మెల్యే యోగం లేదని గుడివాడ భవిష్యవాణి వినిపించారు.













