టీటీడీకి మినహాయింపు సాధ్యం కాదు
జీఎస్టీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి మినహాయింపునివ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఒకరికి మినహాయింపునిస్తే దేశవ్యాప్తంగా అలాంటి సంస్థలన్నీ అదే వెసులుబాటు కోరుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ సమావేశానంతరం వీలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మరోవైపు ఇదే అంశంపై అరుణ్ జైట్లీకి విజ్ఞాపన పత్రం అందించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీనిపై చర్చించడానికి తాజా సమావేశంలో సమయం దొరకలేదని, వచ్చే సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.













