కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణానదిపై రూ.1,082.56 కోట్ల వ్యయంతో ఐకానిక్ తీగల వంతెనను నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సిద్ధేశ్వరం, సోమశిల మధ్య ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. విశాలమైన శ్రీశైలం జలాశయానికి చేరువగా, నల్లమల అడవి, ఎత్తయిన కొండల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణ వైపున లలితా సోమేశ్వర ఆలయం, ఏపీ వైపున సంగమేశ్వర ఆలయంతో ఇదొక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ తరహా బ్రిడ్జి ప్రపంచంలోనే రెండోదని, మనదేశంలో మొదటిది కానుందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ విధానం వల్ల ఆర్థిక భారం తగ్గడంతోపాటు చూడటానికి అందంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిడ్జి దిగువన పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మించే గాజుమార్గం, పైలాన్ గోపురాలు, ప్రత్యేకమైన లైటింగ్, నల్లమల అడవులు, కొండలు, శ్రీశైలం రిజర్వాయర్ వంటివి ఆకర్షణీయంగా నిలవనున్నట్టు తెలిపారు. వంతెనకు తెలంగాణవైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఏపీ వైపు సంగమేశ్వర ఆలయం ఉంటాయన్నారు.
పుట్టపర్తి-కోడూరు మధ్య 4 లేన్ల రోడ్డు
పుట్టపర్తి`కోడూరు మధ్య రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు గడ్కరీ వెల్లడిరచారు. రెండేళ్లలో రూ.1,318.57 కోట్ల ఖర్చుతో 47.65 కిలోమీటర్ల రోడ్డు ఆధునీకరణను పూర్తి చేస్తామని.. దీనితో పుట్టపర్తి`బుక్కపట్నం మధ్య రవాణా సదుపాయం మెరుగవుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కూడా కనెక్టివిటీని పెంచుతుందన్నారు.













