Aadi Srinivas: అందుకే తెలంగాణ సెంటిమెంట్ : ఆది శ్రీనివాస్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దెబ్బకు భారత రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితిని విమర్శిస్తే తెలంగాణ(Telangana)ను విమర్శించినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో బిహార్ (Bihar) తరహా సంస్కృతిని తీసుకువస్తున్నారని ఆక్షేపించారు. భారత రాష్ట్ర సమితి నేతల ఆటలు సాగవన్నారు. భారత రాష్ట్ర సమితి వద్ద ఉన్న అన్ని అస్త్రాలు అయిపోయాయని అందుకే తెలంగాణ సెంటిమెంట్‌ను ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చకు రమ్మని సీఎం రేవంత్ రెడ్డి (Aadi Srinivas) సవాల్ చేస్తే కేటీఆర్ (KTR) పారిపోయారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.













