పోలవరంపై పులివెందుల పంచాయితీ
పోలవరంపై జగన్ పులివెందుల పంచాయితీ పెట్టారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 రోజుల్లో సెటిల్మెంట్ చేసుకోవాలని జగన్ చెబుతున్నారన్నారు. పోలవరం పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. అయితే పోలవరం పునుల్లో అవినీతి అంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పోలవరం డ్యామ్ దగ్గర గోదావరి వరదను మళ్లించేందుకు నవయుగ ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని సృష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 70 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై అవినీతి జరిగిందంటూ దిగజారి ప్రభుత్వంలోని పెద్దలు అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ట్రాన్స్ ట్రాయ్ నుంచి నిబంధనలకు అనుగుణంగా నవయుగకు పనులు అప్పగించామని, కేంద్ర జలవనరుల శాఖ, నిపుణులు, ఇంజినీర్లు పర్యవేక్షణలో పోలవరం కట్టామని తెలిపారు. ఇప్పుడు ఎటువంటి నోటీసులు లేకుండా పనులు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.













