ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అధికారులును ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్ ఎండీని ఆదేశించింది. గతంలో డీపీఆర్ రూపక్పనకు ఎస్సెల్ ఇన్ఫ్రా కన్సార్టియంకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త డీపీఆర్‌కు ప్రతిపాదను ఆహ్వానించింది. విశాఖలో 79.9 కి.మీ. పరిధిలో మైట్రోరైల్ నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌కు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది.













