పేదలకు చేసిన సంక్షేమానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం
టిడిపి నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
గవర్నర్ ప్రసంగం నాలుగేళ్ల అభివృద్ధిని ప్రతిబింబించింది: ముఖ్యమంత్రి చంద్రబాబు
పేదలకు చేసిన సంక్షేమానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. గ్రామగ్రామానా ప్రచారం చేయాలి. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలో బిజెపి చేసిన అన్యాయాన్ని వివరించాలి. ఢిల్లీలో ధర్మపోరాటానికి అందరూ సిద్ధం కావాలి. పార్లమెంటులో పోరాటాన్ని మన ఎంపిలు మరింత ఉధృతం. ఢిల్లీ దీక్షకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలి. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు. నల్లబ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు జరపాలి. ప్రజల మనోభావాల ప్రకారమే తెలుగుదేశం. ప్రజా సాధికారతే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి. అందుకు కావాల్సిన పునాదులు వేస్తున్నాం. ఏపి నిలదొక్కుకుంది అంటే తెలుగుదేశం వల్లే. ప్రతి కార్యకర్తకు,నాయకుడికి గర్వ కారణం. టిడిపి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ అభివృద్ధి పదికాలాలు కొనసాగుతుంది. తెలుగుదేశం రాకపోతే రాష్ట్రంలో అరాచకం. టిడిపి రాకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారం. రైతులు, మహిళలు, యువతలో ఇదే భావన. బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీల్లో ఇదే భావన. మహిళలు, రైతులు, పెన్షనర్లు టిడిపికి అండదండ. అన్నివర్గాల మద్దతు టిడిపికి ఏకపక్షం కావాలి.













