2019-20 బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగం
సమాజమే దేవాలయం-ప్రజలేే నా దేవుళ్లు అనే ఎన్టీఆర్ మాటల్ని ఉటంకించిన గవర్నర్ నరసింహన్
శాసససభ, మండలి 6వ మరియు చివరి ఉమ్మడి సమావేశం. 2019-20 బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ శ్రీ నరసింహన్ ప్రసంగం ప్రారంభం. మా ప్రభుత్వానికి మార్గదర్శకం దూరదృష్టిగల ఎన్టీఆర్: గవర్నర్ నరసింహన్
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ప్రబోధమే మార్గదర్శకం. రాష్ట్ర పునర్విభజన చట్టం ఫలితంగా అనేక అంశాలు. వాటిలో అనేకం ఈ రోజు వరకు నెరవేరలేదు. విభజన రాష్ట్ర ప్రజలు అనేక కష్టనష్టాలకు గురిచేసింది. విభజనలో ఎటువంటి హేతుబద్దత లేదు. ప్రజలతో, వారి ప్రతినిధులతో సంప్రదింపులు లేవు.
విభజన సమస్యలపై నేను మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. గత బడ్జెట్ సమావేశంలో కూడా మాట్లాడాను. గౌరవ సభ్యులు అందరికీ గుర్తుచేస్తున్నాను.
విభజన చేసిన గాయం చాలా తీవ్రమైనది. నాలుగున్నరేళ్ల తరువాత కూడా చట్టంలో అనేక అంశాలను నెరవేర్చలేదు. అందుకే దీని గురించి పదేపదే ప్రస్తావిస్తున్నాం.
తలసరి ఆదాయం అతి తక్కువగా ఉన్న కొత్త రాష్ట్రం. హైదరాబాద్,చెన్నై,బెంగళూరు వంటి రాజధాని లేకుండా చేశారు. తీవ్ర ఆర్ధికలోటు, అసమానంగా ఆస్తుల పంపకం, పరిశోధన, అభివృద్ధి సంస్థల కొరత, ప్రామాణికంగా లేకుండా చేసిన విభజన తీవ్ర సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టాయి. భౌగోళిక ప్రాతిపదికన ఆస్తుల పంపిణీ, జనాభా ప్రాతిపదికన అప్పుల పంపిణీ, 58.42% జనాభా గల కొత్తరాష్ట్రం ఏపికి ఉమ్మడి రాష్ట్ర రాబడుల్లో 46% మాత్రమే ఉండేలా విభజన చేయడం, విద్యుత్ రంగంలో వినియోగం ప్రాతిపదిక కారణంగా ఆంధ్రప్రదేశ్ మరిన్ని కష్టనష్టాల్లో పడింది.













