ఏపీతో నాది పెద్ద సంబంధం
ఆంధ్రప్రదేశ్తో నాది పెద్ద సంబంధం. నా విద్యాభ్యాసం విజయవాడలో అట్కిన్సన్ స్కూల్లో జరిగింది. 1951లో మేము గవర్నర్పేటలో నివాసమున్నాం. ఇది ఉద్వేగభరిత సందర్భం. అద్భుతమైన గెట్ టు గెదర్ అంటూ గవర్నర్ నరసింహన్ భావోద్వేగంతో ప్రసంగించారు. విజయవాడలో గవర్నర్కు వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. అతను ప్రమాణస్వీకారం చేసేటప్పుడు నాకు త్యాగరాజస్వామి రాసిన నను పాలింపగ నడిచివచ్చితివా అనే పాట గుర్తొచ్చింది. ఇక పై ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని పాలించేందుకు నడిచివచ్చావా జగన్ అని పాడుకుంటారని అనిపించింది. గవర్నర్ను ఒక పెద్దాయనగా ఎప్పుడూ గుర్తుంచుకుంటామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఒకవైపు మనసులో బాధా ఉంది. మరోవైపు ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదు హైదరాబాద్లోనే ఉంటారన్న ఆనందమూ ఉంది. నాకు గవర్నర్తో పదేళ్లుగా పరిచయం ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక నా చేయి పట్టుకుని నడిపించారు. ఇంకా కొంతకాలం మన గవర్నర్గా కొనసాగి ఉండుంటే ఆ చేయి పట్టుకుని ఐదేళ్లు నడిచే మంచి అవకాశం ఉండేది అని జగన్ అన్నారు.













