గవర్నర్ నరసింహన్ అరుదైన ఘనత
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించడం ద్వారా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నారు. జగన్‌తో కలిపి ఆయన ఐదురుగు ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించినట్లవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా 2009 డిసెంబరులో నరసింహన్ బాధ్యతలు చేపట్టారు. 2010 నవంబరు 25న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేయించిన నరసింహన్, అదే నెల ఎనిమిదో తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌తో 2018 డిసెంబరు 13న ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ విజయవాడలో నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.













