మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధప్రదేశ్ రాజధాని అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ-2014, వికేంద్రీకరణ -ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్ తన ఆమోద ముద్ర వేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.













