ఏయూను సందర్శించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖ ఆంధ్రావిశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వర్సిటీకి వచ్చిన హరిచందన్‌ను అక్కడి అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విధ్యాభివృద్ధి దేశ స్థితిగతులను మార్చుతుందన్నారు. దేశ విద్యా వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ఆంధ్రా యూనివర్సిటీ విశేష కృషి చేసిందనీ, భవిష్యత్‌లోనూ ఎన్నో విద్యా కుసుమాలను అందిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. నానాటికీ నీటి, వాయు కాలుష్యం పెరుగుతోంది, వాటిని తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకానికి విశ్వ విద్యాలయాలు ప్రాధానత్య నివ్వాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటు పడాలని కోరారు.













