ప్రపంచానికే భారత్ ఆదర్శం : గవర్నర్ విశ్వభూషణ్
శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ గణనీయమైన ప్రగతి సాధిస్తూ అంతరిక్ష వినియోగంలో సుస్థిరత సాధించే దిశగా పయనిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి ఇండోర్ స్టేడియంలో ఇస్రో, సతీస్ధావన్ స్పేస్ సెంటర్, సత్యసాయి విశ్వివిద్యాలయం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని గవర్నర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతికత, ప్రయోజనాలను విద్యార్థులు, సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం అభినందనీయమన్నారు. గవర్నర్ను సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, సత్యసాయి విశ్వవిద్యాలయ ఉపకులపతి సంజీవి ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.













