Sunil Kumar :సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ (Sunil Kumar ) పై విచారణకు అథారిటీని వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా(RP Sisodia), విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta )లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై అభియోగాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.













