ఏపీ ఎన్నికల ఫలితాలపై సెల్ఫ్ మేడ్ సెఫాలజిస్ట్ల కామెడీ తో హీట్ ఎక్కుతున్న సోషల్ మీడియా..
ఈసారి ఆంధ్రాలో ఓటింగ్‌కు.. ఫలితాలకు మధ్య చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. దీంతో రాబోయే ఎన్నికల ఫలితాలాపై ఊహగానాలు మొదలయ్యాయి. రాసుకున్నోళ్లకి రాసుకున్నంత..చెప్పుకున్నోళ్లకి చెప్పుకున్నంతలా ప్రస్తుతం ఆంధ్రాలో పరిస్థితులు ఉన్నాయి.నిన్న మొన్నటి వరకు రాజకీయ విశ్లేషకులు.. నాయకులు న్యూస్ చానల్స్ తో చర్చ కార్యక్రమాలు నిర్వహించారు.. ఇప్పుడు సెఫాలజిస్ట్ లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. దీంతో సెల్ఫ్ మేడ్ సెఫాలజిస్ట్ లు పుట్టుకు రావడమే కాకుండా.. తమ స్ట్రాటజీలతో ఫలితాలు గురించి వివరణ ఇచ్చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి ఇటువంటి స్ట్రాటజీలను వాడడం మరొక విశేషం.
కూటమికి అనుకూలంగా ఉండే ఓ ఛానల్లో క్యాబినెట్లో బెర్తుల గురించి కూడా ఖరారు ఇన్ఫర్మేషన్ ని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో న్యూస్ చానల్స్ పార్టీ వైడ్ గా విభజించబడి ఉన్నాయి. ఏ ఛానల్ ఏ పార్టీ కోసం పని చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని చానల్స్ న్యూట్రల్ ముసుగులో కూటమికి వంత పాడడం మొదలుపెట్టాయి. అయితే వీళ్ళు పార్టీలకు పని చేయడం లేదు.. వ్యక్తిగతంగా నాయకులు ఇచ్చే ప్యాకేజీకి ఫిదా అయి పనిచేస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. అందుకే నాయకులకు వత్తాసు పలుకుతూ.. వారికి అనుకూలంగా వార్తలు వైరల్ చేస్తున్నారు.
తాజాగా కూటమి క్యాబినెట్ ని ప్రకటించింది అని ఓ ఛానల్ చెప్పడం.. జనసేనకు మూడు కేబినెట్ బెర్త్ లు కన్ఫామ్ అయ్యాయి అని చెప్పడంతో పాటు ఒక అడుగు ముందుకేసి ఆ మూడింటిని ఎవరెవరికి ఇస్తారో కూడా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్యాబినెట్ కూర్పు హాట్ టాపిక్ గా మారింది. కూటమి అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కానీ.. కూటమి క్యాబినెట్ అంటూ సదర న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో కొత్త డిస్కషన్ కి తెర లేపుతోంది. ఈ వార్తలపై స్పందించిన కొందరు నెటిజెన్లు అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఈసారి ఆంధ్రాలో ఎన్నికలు ఒక మంచి థ్రిల్లింగ్ యాక్షన్ కామెడీ చిత్రానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ముందుకు సాగుతున్నాయి. ఓటింగ్ రోజు జరిగిన ఘర్షణలు.. ఆ తర్వాత ముదిరిన గొడవలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారాలు.. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఈసారి ఆంధ్ర ఇండియాలోనే వైరల్ గా మారుతుంది. రేపు ఎన్నికలు ఫలితాలు విడుదల అయ్యాక సోషల్ మీడియాలో ఎంత హడావిడి జరుగుతుందో చూడాలి.













