జగన్ పాలనలో రాష్ట్రంలో.. అంతులేని
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో అంతులేని అరాచకాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ను అరెస్టు చేసి కేసు లోగుట్టును సీబీఐ వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. వివేకా కేసును తప్పుదోవ పట్టించడంలో జగనే దోషి అని చెప్పారు. జగన్ సకుంటుంబ సపరివార సమేతంగా చేసిన కుట్ర ఫలితమే వివేకా హత్య అని ఆరోపించారు. ఈ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని అన్నారు. ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా మారిందని ఎద్దేవా చేశారు.













