ఆ అధికారులను విడిచిపెట్టం… చట్టప్రకారం చర్యలు
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సాయాన్ని రూ.3 వేల నుంచి 4 వేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచారని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధి పైనా తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందని తెలిపారు. అన్న క్యాంటీన్లను కూడా తెరిపిస్తున్నామన్నారు. తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టబోమని, చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేయిస్తామని తెలిపారు.













