Chandrababu :ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు … కేంద్ర ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల (Chilli farmers)ను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన రాసిన లేఖకు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం శుభవార్త (Good news) చెప్పింది. క్వింటా మిర్చికి రూ.11,781 ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ధర ప్రకటించింది. 2.58లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. నెలపాటు ఈ ఉత్తర్వులో అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) తోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్రం మిర్చికి ధర ప్రకటించింది.













