ఏపీ ప్రభుత్వం శుభవార్త… త్వరలో
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్పీపై ప్రకటన చేస్తామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇదే అంశాన్ని ఒప్పంద అధ్యాపకులకు చెప్పామన్నారు. మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ అది తమ పార్టీ, ప్రభుత్వ విధానమని మంత్రి పునరుద్ఘాటించారు.













