తిరుమల భక్తులకు గుడ్ న్యూస్… సామాన్య భక్తులకు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకి త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని చైర్మన్ తెలిపారు. నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య తాక్రే నేడు స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. దాదాపు 500 కోట్లు విలువ చేసే స్థలం. త్వరలోనే ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతాం. ఆలయ నిర్మాణానికి పూర్తి ఆర్థికంగా ఇవ్వడానికి గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారని తెలిపారు.













