ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురందించింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 5 నుండి జూన్ 4 వరకు ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. పరస్పర బదిలీలు, విజ్ఞప్తులపై బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడేళ్ళ సర్వీసూ పూర్తి చేసుకున్నవారికి ఈ బదిలీ నిబంధన వర్తిస్తుందన్నారు. ఉపాధాయులకు మాత్రం ఈ సారి బదిలీలకు అనుమతి లేదని సృష్టం చేసింది. ఆరోగ్య సమస్యలు, వికలాంగులు, వితంతువులు వంటి కేసులకు ఖాళీలుంటే మాత్రమే బదిలీలుంటాయని పేర్కొన్నారు. ఇక భార్యభర్తల విషయంలో కనీసం 8 ఏళ్ళపాటు బదిలీకాలం వ్యతాస్యముంటే ట్రాన్స్ఫర్ ఉంటుందన్నారు. ఏసిబి, విజిలెన్సు కేసుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం బదిలీ వర్తించదని సృష్టం చేశారు. జూన్ 5 తర్వాత యధావిధిగా ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.













