భక్తులకు కీలకమైన వెసులుబాటు కల్పించిన టీటీడీ

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం టిక్కెట్లు పొంది, రాలేకపోయిన వారికి ఓ వెసులుబాటు కల్పించింది. దర్శనం తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. కరోనా నేపథ్యంలోనే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. కరోనా, లాక్‌డౌన్‌తో పాటు కర్ఫ్యూ కారణాల రీత్యా బుక్ చేసుకున్న సమయానికి దర్శనానికి రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని టీటీడీ గుర్తించింది. రోజుకు 15 వేల టిక్కెట్లు ఉన్నా, కేవలం 3 వేల మంది భక్తులు మాత్రమే దర్శనాలను వస్తున్నారు. దీనిని గమనించే దర్శనం తేదీని మార్చుకునే సౌలభ్యాన్ని ప్రకటించింది. ఒకసారి మాత్రమే తేదీని మార్చుకోవచ్చని, ఏడాదిలో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తామని టీటీడీ పేర్కొంది.