Vande Bharat: హిందూపురం వాసులకు గుడ్న్యూస్ …వందే భారత్ కు
యశ్వంత్పూర్ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్ రైలు (Vande Bharat train) ఈనెల 27నుంచి హిందూపురం (Hindupuram) లో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఎంపీ బీకే పార్థసారథి (MP BK Parthasarathi) హిందూపురం లో వందేభారత్ రైలు ఆపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సోమన్నను కోరారు. దీనికి స్పందించిన మంత్రి ఈనెల 27నుంచి హిందూపురంలో రెండు నిమిషాలపాటు ఆపేందుకు రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 20704, 20703 నంబర్ల రైళ్లు ఆపనున్నారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు హిందూపురం రైల్వే స్టేషన్లో రైల్వేశాఖ మంత్రి సోమన్న (Minister Somanna), ఎంపీ బీకే పార్థసారథి జెండా ఊపి, ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.






