ఏపీ రైతులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయంపై రూ.వెయ్యి పెంచుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పెట్టుబడి సాయం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీన్ని మూడు విడతల్లో అందజేస్తామన్నారు. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లపాటు ఈ పథకాన్ని అమలు చేస్తామని కన్నబాబు సృష్టం చేశారు. ఈ పథకం కింద లక్షల మంది కౌలు రౌతులకు నేరుగా పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. రైతులకు మే నెలలో రూ.7.500, రబీ అవసరాలకు రూ.4,000, సంక్రాంతికి రూ.2000 చొప్పున అందజేస్తామని అన్నారు. 40 లక్షల మందికి వైఎస్ఆర్ రైతుభరోసా అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని అన్నారు.













