Minister Narayana: త్వరలోనే వారికి శుభవార్త : మంత్రి నారాయణ
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికుల డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంతవరకూ పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారన్నారు. కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) పలు మార్లు చర్చించిందన్నారు. వారికి మేలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్ధిక శాఖ (Finance Department ) తో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడిరచారు.













