ఏపీ పాలన దేశానికి మార్గదర్శి
615 సర్టిఫికెట్లిచ్చిన మోడీ..!
ఆంధ్రప్రదేశ్ అంటే.. సుపరిపాలనకు మార్గదర్శి. ఆర్థిక అసమానతలను తగ్గించేలా.. సుపరిపాలన అందిస్తోంది ఏపీ. 7 మిషన్లు, 5 ప్రచార ఉద్యమాలు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేశారు*. *అవినీతికి అవకాశం లేని పాలనా విధానాలు రూపొందారు. ఫలితంగా.. దేశం మొత్తంలో అద్భుతమైన విధానాలు అవలంభిస్తూ.. ప్రజల జీవితాల్ని ఎప్పటికప్పుడు మమేకం చేస్తున్న ఏకైక.. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయంలో లభించిన అనేక… అవార్డులే దీనికి సాక్ష్యం. ఈ అవార్డులన్నీ ప్రభుత్వం కాకుండా… ప్రైవేటు సంస్థలు ఇచ్చినవి కావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే. ప్రభుత్వం అత్యంత సిన్సియర్ గా పని చేస్తున్నందుకు.. ప్రజల జీవిన ప్రమణామాలను పెంచేందుకు చేస్తున్న కృషికి మెచ్చి ఇచ్చినవే.
కేంద్రం విభజన హామీలు అమలు చేయకపోయినా, ఏ రకంగానూ సహకరించకపోయినా.. పనితీరుతోనే ఏపీ అవార్డులు దక్కించుకుంది. కేంద్రం సహాయ నిరాకరణ చేసినా వివిధ ప్రభుత్వ శాఖలు 615 అవార్డులు సాధించాయి. వయోజన విద్య-4; వ్యవసాయం-1; పశుసంవర్థక-5; పౌరసరఫరాలు-10; అటవీ-2; విద్యుత్, మౌలిక వసతులు-107; ఆర్థిక -5, ఆరోగ్యం-55; నిఘా-1; ఉద్యానవన -6; హౌసింగ్-15; పరిశ్రమలు-7; ఐటీ -38; మున్సిపల్, పట్టణాభివృద్ధి-91; గనులు-10; పంచాయతీరాజ్-82; ప్రణాళిక-2; పోలీసు-2; రెవెన్యూ-8; ఆర్టీజీ 5; గ్రామీణాభివృద్ధి-12; ఆర్డబ్ల్యూఎస్ 2; ఎస్ఏసీ-1; సాంఘిక సంక్షేమం-15; టూరిజం-10; రోడ్డు రవాణా-8; గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ-4; జలవనరులు-30; మహిళా శిశు సంక్షేమం-15; యువజన సర్వీసులు-20; ఇతర కేటగిలీల్లో ఎనిమిది అవార్డులు అందుకున్నారు.
ఈ అవార్డులన్నీ చూసిన తర్వాత..
ఏపీ పై..ఏపీలో పాలనపై విమర్శలు చేస్తే.. అది రాజకీయమే తప్ప మరొకటి కాదు. ఈ విషయంలో.. బీజేపీ నేతలు… ఇక నోరెత్తడానికి అవకాశం లేదు. ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే.. ఈ అవార్డులే వారికి సమాధానం చెబుతాయి. రాజకీయ కారణాలతో.. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న కేంద్రం… ఏపీలో సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వంపైనా బురద జల్లేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు నిజానికి ఈ అవార్డులన్నీ.. కేంద్రం ఎగ్గొట్టగలిగేదే… కానీ.. సూచీలను మార్చలేక.. విధిలేని పరిస్థితుల్లో ఈ అవార్డులు ఇచ్చారు. ఇక ఇవ్వకుండా ఎగ్గొట్టినవి ఎన్ని ఉన్నాయో..!













