సీఎం చంద్రబాబు దంపతులకు గోల్డెన్ పీకాక్ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డులు అందుకోనున్నారు. ఈ నెల 25న లండన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన లీడర్షిప్ ఇన్ ట్రాన్స్ ఫార్మింగ్ గవర్నెన్స్ విభాగంలో చంద్రబాబుకి అందజేస్తారు. ఎక్స్లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ కేటగిరీలో హెరిటేజ్ పుడ్స్ లిమిటెడ్ ఎంపికైంది.ఆ సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ అవార్డును అందుకుంటారు. దంపతులిద్దరూ వేర్వేరు కేటగిరీల్లో ఒకే వేదికపై గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోవడం విశేషం.













