Ontimitta : ఒంటిమిట్ట సీతారామలక్ష్మణలకు… రూ.6.67 కోట్లతో స్వర్ణ కిరీటాలు
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం (Kodanda Rama Temple ) లో కొలువైన సీతారామలక్ష్మణ మూలవరులకు పారిశ్రామికవేత్త, పెన్నా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పుట్టం రెడ్డి ప్రతాప్‌రెడ్డి(Puttam Reddy Pratap Reddy) , కుటుంబ సభ్యులు రూ.6,66,99,084 విలువైన 7,172.464 గ్రాముల బరువున్న మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీదేవి (lakshmi devi) దంపతులు, కుమార్తె దీప్తి, ఆయన సోదరుడు రమేష్ రెడ్డి-సుప్రియ దంపతులు, వదిన పద్మావతమ్మ, కుటుంబ సభ్యులు కిరీటాలను రామయ్య క్షేత్రానికి తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) , ఈవో జె.శ్యామలరావు (J. Shyamala Rao ) కు అందజేశారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతాప్‌రెడ్డి, రమేష్ రెడ్డి, సోదరులను చైర్మన్ బీఆర్ నాయుడు శేషవస్త్రాంతో సత్కరించారు.













