ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సమూల మార్పులు చేస్తూ ఏఐసీసీ నియామకాలు చేపట్టింది. ఏపీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజును నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాకేశ్ రెడ్డిలను నియమించింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజుకు ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించింది. అలాగే ప్రచార కమిటీ చైర్మన్గా జీవీ హర్ష కుమార్ను, మీడియా సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా ఎన్. తులసి రెడ్డిని నియమించింది. పొలిటికల్ ఆఫైర్స్ కమిటీలో 18 మంది నేతలకు చోటు కల్పించగా, సమన్వయ కమిటీలో 34 మంది నేతలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది.













