ముఖ్యమంత్రిని కలిసిన గజిటెడ్ అధికారుల సంఘం, ఏపీఎన్జీవో నేతలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన నేతలు
11వ పీఆర్సీ ప్రకటించేవరకు మధ్యంతర భృతి ఇవ్వాలని వినతి
ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాలు :
• 11వ పీఆర్సీ నివేదిక ఇంకా రానందున ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని వినతి
• ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని కోరిన ఉద్యోగ సంఘాల నేతలు
• రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అంతా తమ వెంటే ఉన్నారని చెప్పిన నేతలు
• గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చినందుకు ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞత కలిగిఉన్నాం
-మరిన్ని వినతులు
• ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విధానం తరహాలోనే రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దు చేయాలి, షేర్ మార్కెట్లో ఉద్యోగుల కష్టార్జితాన్ని పెట్టడంతో ఎంతో నష్టపోతున్నారు
• ప్రభుత్వ సంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే వారికి సైతం పీఆర్సీ అమలు చేయాలి, ఇక్కడ 4 వేల మంది ఉద్యోగులే ఉండటంతో సానుకూలంగా పరిశీలించాలి
• కాంట్రాక్ట్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి :
• మధ్యంతర భృతిపై రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
• రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలి
• కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఆటకంగా ఉన్నాయి. దానిపై అప్పీలుకు వెళ్లాల్సి ఉంది
• నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు ప్రభుత్వానికి అందించిన సహకారం మరువలేనిది
• దేశంలో అన్ని రంగాల్లో ముందునిలిచామంటే దానికి కారణం ఉద్యోగులు అంతా సమిష్టిగా ప్రభుత్వానికి అండగా నిలవడం వల్లే సాధ్యమైంది
• హైదరాబాద్‌ను వదిలి కట్టుబట్టలతో మీరంతా అమరావతికి వచ్చారు
• మన భవిష్యత్ కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం నవ్యాంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని మీరంతా ఉద్యమించారు
• కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావు
• ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.75 వేల కోట్లు రావాల్సి ఉంది
• ప్రధాని నరేంద్రమోదీ తన విధానాలతో భారతదేశ ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు
• పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన దాంట్లో ఇంకా సుమారు రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది
• చివరికి నరేగా నిధులను సక్రమంగా కేంద్రం విడుదల చేయడం లేదు
• జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది
• రుణాలు తెచ్చుకునేందుకు వీలులేని పరిస్థితి కల్పించారు.
• ఉద్యోగులను ఇబ్బందిపెట్టాలని ఎప్పుడూ అనుకోను
• తెలంగాణలో 60 ఏళ్ల పడ్డ కష్టానికి తగ్గ ఫలితం నవ్యాంధ్రప్రదేశ్లోనూ దక్కాలంటే మరో 15 ఏళ్లు శ్రమించాలి
• ఇప్పుడు కొత్త చరిత్ర నిర్మించే దశలో ఉన్నాం, మన కష్టం భావితరాలకు పునాది కావాలి
• నాలుగేళ్లలో 3 తుఫాన్లు ఎదుర్కొన్నాం, రాయలసీమలో ప్రతీఏటా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం
• రాయలసీమకు కృష్ణా జలాలు తరలించి కోలుకునేలా చేశాం
• ఇంకా మనం కంఫర్ట్ జోన్‌కు చేరుకోలేదు.













