మంగళగిరిలో 18 నుంచి గాయత్రీ మహాయాగం
గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయ ప్రాంగణంలో మే 18 నుంచి జూన్ 11 వరకు లోకకళ్యాణార్థం సర్వతోముఖ గాయత్రీ మహాయాగం నిర్వహిస్తున్నట్లు మహాయాగనిర్వహణ సమితి తెలిపింది. నాలుగుకోట్ల గాయత్రీ మంత్రజపం పూర్తి చేసిన బ్రహ్మశ్రీ నేమాని సుబ్బారావు పంతులు దంపతుల యాగ యాజమాన్యంలో శ్రౌత శిరోమణి బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి ఆచారత్వంలో, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారి సహాయ సహకారములతో జరుగుతున్న ఈ యాగంలో అందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ యాగ నిర్వహణ కోసం ఎవరైనా ధనసహాయం చేయదలిస్తే ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు. 9908815482, 9885236463, 9949134850.













