ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు.1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన్ను పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌వోపీఎఫ్)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం డీజీపీగా వ్యవహరిస్తున్న ఆర్.పి.ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ చేశారు. 1963 జులై 10న జన్మించిన సవాంగ్.. గతేడాది జులై నుంచి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనకు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.













