ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలో డీజీపీ కార్యాలయంలో ఆయన కుటుంబ సమేతంగా విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. సేవాభావంతో పనిచేస్తామని, మహిళలపై లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తామని వెల్లడించారు. సామాన్యులకు పోలీస్ శాఖ చేరువలో ఉంటుందని సృష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం. పోలీస్ శాఖ తమ కోసమే ఉందని ప్రజలు అనుకునేలా చేస్తాం. పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి అని డీజీపీ తెలిపారు.













