తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

గరుడ పంచమి పురస్కరించుకుని శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ఘనంగా జరిగింది. సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌సుందర్ దంపతులు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌ఓ శ్రీధర్ పాల్గొన్నారు.