మంత్రులు రాజీనామా చేస్తే.. టీడీపీ పోటీ పెట్టదు
విశాఖ ఉక్కుపై అందరం కలిసి పోరాడాలని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వైఖరిని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. రాష్ట్రంలోని పెద్దలు ఏం జరగలేదని తప్పుదోవ పట్టించారు. రాష్ట్రానికి సమాచారం అందిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. ప్రైవేటీకరణపై ఆర్థికమంత్రి ముగిసిన అధ్యాయమన్నారు. సీఎంతో కలిసి పనిచేస్తామని చంద్రబాబు కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉప సంహరణకు బీజేపీ నేతలు ప్రధాన పాత్ర పోషించాలి. ప్రధానిని కలిసినప్పుడు విశా• ఉక్కు అంశం సీఎం ఎందుకు ప్రస్తావించలేదు. ఢిల్లీలో పాదయాత్రకు మేము సిద్ధం అందరు కలిసి రావాలి. విశాఖ ఉక్కుపై పవన్ కల్యాణ్ స్పందించాలి. కార్మికుల తరపున పవన్ పోరాడాలి. రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. రాజీనామా చేస్తే టీడీపీ పోటీ పెట్టదు. కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎంను కోరుతున్నామని తెలిపారు.













