Ganta : అందుకు వెన్నుపోటు దినం చేస్తున్నారా? .. వైసీపీకి గంటా సవాల్
హామీల అమలుపై చర్చకు రావాలని వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ (Jagan) ఇంకా తన తప్పులు తెలుసుకోవట్లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆదరణ చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి (Development) చేస్తుంటే వెన్నుపోటు దినం పాటిస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) విషయంలో రూ.12 వేల కోట్లు తెచ్చాం. అందుకు వెన్నుపోటు దినం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.













