ప్రతి ఏడాది జనవరి 1న ..ఎక్కడ ఆ శుభవార్త ? : గంటా
అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ, ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీల వర్షం కురిపించారని, అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు దాటిన వాటిని నెరవేర్చలేదని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై గుడ్ న్యూస్ అని మంత్రి బొత్స చెబుతున్నారన్నారు. ఈ రెండు మూడు రోజులు అయిపోయాయని మరి గుడ్ న్యూస్ ఎక్కడ అని ప్రవ్నించారు. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు? టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు అని అన్నారు. రాత పరీక్ష ఎప్పుడు? పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారు? ఎన్నికల పూర్తయ్యే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలరా? ఎందుకు ఈ వట్టి మాటలు? నిరుద్యోగులను ఎన్ని రోజులని మభ్యపెడతారు? అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.













