తాను వైసీపీలోకి వెళ్లను.. టీడీపీని వదులుకోను
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం పై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ తాను వైసీపీలోకి వెళ్లను, టీడీపీని వదులుకోను అని అన్నారు. గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వాటిని నేను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎప్పడూ మాట్లాడలేదని మారితే కచ్చితంగా చెబుతానని వెల్లడించారు. కాపు బహిరంగ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. రంగా ఒక కులానికో, లేదా మతానికో నాయకుడు కాదని, అన్ని కులాలు, బలహీన వర్గాలకు బంధువు లాంటోడని కొనియాడారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు.













