నాసా పోటీ విజేతలకు మంత్రి గంటా అభినందన
నేషనల్ స్పేస్ సొసైటీ నిర్వహించిన నాసా స్పేస్ సెటిల్మెంట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన ట్రిపుల్ ఐటీ (శ్రీకాకుళం) విద్యార్థినులు లక్ష్మి ప్రియ, అట్టా జ్యోష్ణ, వెంకట లక్ష్మి, బాసెట్టి జీవన సంధ్యారాణి, గంధం నాగ అశ్వినీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభినందించారు. విజేతలు నలుగురు మంత్రి గంటాను కలిశారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కాలిఫోర్నియాలో జరిగే అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో ఈ విద్యార్థినులు పాల్గొంటారు. వీరు అంతర్జాతీయంగా మరింతగా రాణించాలని మంత్రి గంటా ఆకాంక్షించారు.













